కాలపురుషుడి దృష్టిలో మనమంతా బొమ్మలమే - అందుకే బొమ్మల కొలువు!

ప్రతి సంక్రాంతికీ కాలపురుషుడు సంక్రాంతి పురుషుడిగా భూలోకానికి దిగివచ్చి పరిపాలిస్తాడు.

ఆ సంక్రాంతి పురుషుడినే సంకురమయ్య అంటారు.

ఈ చరాచర జగత్తునూ నడిపించే సంక్రాంతి పురుషుడిని స్వాగతిస్తూ బొమ్మల కొలువు పెడతారు.

అంటే మనమంతా కాలపురుషుడి దృష్టిలో బొమ్మలమే.

ఈ బొమ్మలను రక్షించే భారం నీదే అని విన్నపం చేసేందుకే సంక్రాంతికి బొమ్మల కొలువు పెడతారు.

ముందుగా పసుపు వినాయకుడిని పూజిస్తారు

పసుపుతో పెద్ద ముద్ద చేసి బొట్టు పెట్టి సంకురమయ్యగా భావించి పూజిస్తారు

వినాయకుడు, సంకురమయ్య తర్వాత మిగిలిన బొమ్మలు పేరుస్తారు...

Images Credit: Pinterest