సంక్రాంతి గొబ్బిళ్లు వెనుకున్న ఆంతర్యం ఇదే! సంక్రాంతి పండుగ సందర్భంగా పాటించే పద్ధతులు వెనుక మన జీవనశైలి ఇమిడి ఉంటుంది పండుగ ప్రారంభానికి నెల రోజుల ముందు నుంచే సందడి మొదలవుతుంది. ధనుర్మాసం ప్రారంభంలోనే తెలుగు లోగిళ్లన్నీ రంగవల్లులు, గొబ్బిళ్లతో కళకళలాడుతుంటాయి. ముగ్గుల మధ్య గొబ్బిళ్లు.వాటిపై గుమ్మడి, బంతి, చామంతి పూలతో అలంకరించి..పసుపు-కుంకుమతో గౌరీ దేవిని పెడతారు. భోగి రోజు సాయంత్రం గొబ్బిళ్ల చుట్టూ తిరుగుతూ పాటలు పాడతారు. గొబ్బి అనే మాట గర్భా అనే మాట నుంచి వచ్చింది. గోమయంతో చేసే గొబ్బిని గౌరీదేవిగా భావిస్తారు. అందుకే గొబ్బెమ్మను గౌరవిస్తూ పసుపుకుంకుమలతో పూజిస్తారు. ఈ సందర్భంగా పాడే పాటలు అద్భుతంగా అనిపిస్తాయి గొబ్బిపాటల్లో కృష్ణుడిని ఉద్దేశించే ఎక్కువగా ఉంటాయి. వీటిల్లో గోదాదేవి పాశురాల్లో కూడా గొబ్బిళ్ల ప్రస్తావన ఉంటుంది. Image Credit: Pinterest