సాంబారుతో ఆ వ్యాధి పరార్ - అమెరికా డాక్టర్ వెల్లడి

దక్షిణాది ప్రజలు సాంబారును ఎక్కువగా తీసుకుంటారనే సంగతి తెలిసిందే.

ఈ సాంబారులో ఎన్నో ఔషద గుణాలు ఉన్నాయట. నమ్ముబుద్ధి కావడం లేదా?

అమెరికాలో గ్యాస్ట్రోఎంటరాలజీ, ఎపిడెమియాలజిస్ట్ డాక్టర్ పళనియప్పన్ మాణికం ఇది స్పష్టం చేశారు.

సాంబారులో వేసే కూరగాయలు, కొత్తిమీర, జీలకర్ర, నల్ల మిరియాలు, మెంతులే ఇందుకు కారణమట.

అంతేకాదు, అందులో వేసే చింతపండు, సుగంధ ద్రవ్యాలు, పసుపు కూడా కారణమేనట.

ముఖ్యంగా సాంబరు పెద్దప్రేగు కాన్సర్(colon cancer) నుంచి కాపాడుతుందని మాణికం చెప్పారు.

2 ఎలుకలపై జరిపిన అధ్యయనంలో ఇది తేలిందట. వాటికి క్యాన్సర్ కారక రసాయనాన్ని ఎక్కించారట.

వాటిలో సాంబారు తాగిన ఎలుక ఆ క్యాన్సర్ కారకాలతో పోరాడటాన్ని గుర్తించారట.

చూశారుగా.. సాంబారు మనకు ఎంత మేలు చేస్తుందో. ఇకపై వారానికి ఒకసారైనా సాంబర్‌తో తినండి.

Images Credit: Pexels, Pixabay and Unsplash