టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా దూసుకుపోతుంది సమంత.

ప్రస్తుతం ఆమె చేతుల్లో నాలుగైదు సినిమాలు ఉన్నాయి.

అందులో కొన్ని బాలీవుడ్ ప్రాజెక్ట్స్ కూడా ఉన్నాయి.

ఇదిలా ఉండగా.. రీసెంట్ గా ఈ బ్యూటీ తన ఇన్స్టాగ్రామ్ స్టేటస్ లో కొన్ని ఫొటోలను షేర్ చేసింది. 

తన స్నేహితులు మేకప్ ఆర్టిస్ట్ సాధన, స్టైలిస్ట్ ప్రీతమ్ జుకాల్కర్ లతో కలిసి డేట్ నైట్ కి వెళ్లింది. 

తాజాగా మరికొన్ని ఫొటోలు షేర్ చేసింది. 

ఇందులో తన మేకప్ ఆర్టిస్ట్ సాధనతో కలిసి టైం స్పెండ్ చేస్తూ కనిపించింది సామ్. 

ఈ ఫొటోల్లో నవ్వుతూ.. ఫన్నీ ఎక్స్ ప్రెషన్ పెడుతూ కనిపించింది ఈ బ్యూటీ. 

ప్రస్తుతం ఈ ఫొటోలు వైరల్ అవుతున్నాయి.