రైతన్న కోసం మోదీ ప్రభుత్వం ఓ పథకం తీసుకొచ్చింది. 2019లో పీఎం కిసాన్ సమ్మాన్ యోజనను ఆరంభించింది. ఏటా రైతుల బ్యాంకు ఖాతాల్లో రూ.6000 జమ చేస్తారు. రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలంటే.. ముందుగా మీరు పీఎం కిసాన్ యొక్క అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లాలి. తర్వాత రైతుల కార్నర్ కనిపిస్తుంది.. దాని మీద క్లిక్ చేయాలి. 'కొత్త రైతు నమోదు' ఎంపికపై క్లిక్ చేయాలి. తరువాత, ఆధార్ సంఖ్యను నమోదు చేయాలి. దీనితో పాటు, క్యాప్చా కోడ్‌ని నమోదు చేసి.. రాష్ట్రాన్ని ఎంపిక చేసుకోవాలి. తర్వాత ముందుకు వెళ్లాలి. ఈ ఫారమ్‌లో మీ పూర్తి వ్యక్తిగత సమాచారాన్ని ఎంటర్ చేయాలి బ్యాంక్ ఖాతా వివరాలు మరియు పొలానికి సంబంధించిన సమాచారాన్ని అందించాలి. ఆ తర్వాత మీరు ఫారమ్‌ను సమర్పించవచ్చు.