జూన్ 4 శనివారం
రాశిఫలాలు



మేషం
ఈ రోజు మీరు తలపెట్టిన పనులు పూర్తిచేయలేరు. లావాదేవీల నిర్వహణకు ఈ రోజు అనుకూలంగా ఉండదు. కొత్త ఉద్యోగాన్ని ప్రారంభించేందుకు ప్లాన్ చేసుకోండి. ప్రేమ సంబంధాలపై నమ్మకం అలాగే ఉండేలా చూసుకోండి.



వృషభం
స్నేహితులతో సరదాగా స్పెండ్ చేస్తారు. అనుకోకుండా ఎవరితోనైనా గొడవ జరుగుతుంది. ప్రైవేట్ కార్యాలయాల్లో పనిచేసేవారికి పదోన్నతి లభిస్తుంది. ఆర్థిక విషయాల్లో జాగ్రత్త అవసరం.



మిథునం
మీరు ఆరోగ్యం విషయంలో ఒత్తిడికి లోనవుతారు. తలనొప్పి, జ్వరంతో ఇబ్బంది పడతారు. కార్యాలయంలో ఒత్తిడి పెరుగుతుంది. ఎవరిపైనా కోపం ప్రదర్శించవద్దు. నిలిచిపోయిన పనులు ప్రారంభించేందుకు ప్రయత్నిస్తారు.



కర్కాటకం
ఏదో తెలియని భయం మిమ్మల్ని వెంటాడుతుంది. ఆలయ దర్శనానికి వెళ్తారు. ఆస్తి విషయంలో ఒత్తిడులు తొలగిపోతాయి. కడుపు నొప్పితో ఇబ్బంది పడతారు. గతంలో జరిగిన తప్పుల నుంచి పాఠాలు నేర్చుకుంటారు. అనుకున్న సమయానికి పనులు పూర్తవుతాయి.



సింహం
గతంలో తీసుకున్న రుణాన్ని తిరిగి చెల్లించలేక ఒత్తిడికి లోనవుతారు. ఎవరి విషయాల్లో జోక్యం చేసుకోకండి. వివాదాలు పెరుగుతాయి. జీవిత భాగస్వామితో మనస్పర్థలు వచ్చే అవకాశం ఉంది. బంధువులతో సమావేశమవుతారు. ఏకాంతంగా ఉండేందుకు ఇష్టపడతారు.



కన్య
ఈ రోజు మీకు అద్భుతంగా ఉంటుంది. ఉద్యోగంలో మార్పు గురించి చాలా ఆసక్తిగా ఉంటారు. కుటుంబ బాధ్యత పెరుగుతుంది. అవివాహితులకు సంబంధం కుదురుతుంది. ప్రభుత్వ పనులను పూర్తి చేయగలుగుతారు. వ్యాపారంలో ఎక్కువ లాభం పొందుతారు



తులా
ఈ రోజు సాధారణంగా ఉంటుంది. ఓ శుభవార్త వింటారు. విదేశాల్లో ఉన్న బంధువులతో చర్చలు జరుపుతారు. డబ్బు, ఆస్తుల పరిస్థితి సాధారణంగా ఉంటుంది. లావాదేవీల విషయంలో తొందరపడకండి. మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి.



వృశ్చికం
కుటుంబంతో సంతోష సమయం గడుపుతారు. కళతో సంబంధం ఉన్న వ్యక్తులకు రోజు చాలా మంచిది. ఈరోజు బంధువులతో సమావేశం అవుతారు.మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఇంటి వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఆన్‌లైన్ వ్యాపారంలో సమస్య ఉంటుంది.



ధనుస్సు
ఈరోజు ఇంటి విషయాల్లో కొన్ని చికాకులు ఉంటాయి. అనారోగ్య సమస్యలుంటాయి.మీకు సంబంధించిన రహస్యాలను ఎవ్వరితోన పంచుకోవద్దు. కార్యాలయంలో మీ సామర్థ్యం కంటే ఎక్కువ కష్టపడాల్సి ఉంటుంది. మీ స్వభావాన్ని బట్టి ప్రవర్తించండి.



మకరం
మీరు బంధువుల నుంచి సహాయం పొందుతారు. అధికారులు మీ పని పట్ల చాలా సంతోషిస్తారు. తెలివితేటలతో విజయం సాధిస్తారు. కొత్త ప్రాజెక్టులు ప్రారంభిస్తారు. ఈరోజు దినచర్య దెబ్బతింటుంది.పెళ్లికానివారికి సంబంధాలు కుదరక కొంత ఆందోళనలో ఉంటారు.



కుంభం
కష్టాలుంటాయి కానీ ఓపిక పట్టండి. కార్యాలయంలో సమయం మీకు అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు. కోపం, పని ఒత్తిడి తగ్గించుకోండి. ఈ రోజు సాధారణంగా ఉంటుంది.



మీనం
సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ప్రమాదకర పనిని జాగ్రత్తగా చేయండి. సంక్షేమ కార్యక్రమాలకు తమవంతు సహకారం అందిస్తారు. జీవిత భాగస్వామితో కలిసి షికారు వెళ్తారు. రక్తపోటు పెరగవచ్చు. మీ వ్యక్తిగత సమస్యల్లో ఎవ్వర్నీ జోక్యం చేసుకోనివ్వొద్దు.