దక్షిణ కొరియా కార్ల తయారీ కంపెనీ కియా ఎలక్ట్రిక్ కారు ఈవీ6 మనదేశంలో లాంచ్ అయింది.

ఇందులో ఎంట్రీ లెవల్ జీటీ లైన్ ఆర్‌డబ్ల్యూడీ వేరియంట్ ధర రూ.59.95 లక్షలుగా (ఎక్స్-షోరూం) ఉంది.

టాప్ ఎండ్ జీటీ లైన్ ఏడబ్ల్యూడీ వేరియంట్ ధరను రూ.65.95 లక్షలుగా (ఎక్స్-షోరూం) నిర్ణయించారు.

ప్రత్యేకమైన ఈవీ ప్లాట్‌ఫాంపై ఈ కారును రూపొందించారు. ఈ కారుకు సంబంధించిన బుకింగ్స్ కూడా ఇటీవలే ప్రారంభం అయ్యాయి.

రూ.3 లక్షల బుకింగ్ అమౌంట్ చెల్లించి దీన్ని కొనుగోలు చేయవచ్చు.

ప్రస్తుతానికి కియా మనదేశంలో మొదట కేవలం 100 యూనిట్లను మాత్రమే విక్రయించాలని నిర్ణయించింది.

అయితే దీనికి సంబంధించి మొత్తంగా 350 బుకింగ్స్ వచ్చాయని కంపెనీ తెలిపింది.

మిగిలిన వారికి బుకింగ్ అమౌంట్ రీఫండ్ ఇస్తారా? లేదా ఇంపోర్ట్ నంబర్ పెంచి వారికి కూడా డెలివరీ చేస్తారా అన్నది తెలియరాలేదు.

ఒక్కసారి చార్జ్ చేస్తే 528 కిలోమీటర్లు దూరం ప్రయాణించవచ్చు. 10-80 శాతం చార్జింగ్ 18 నిమిషాల్లోనే ఎక్కుతుంది.