ఇంట్లోనే చాలా తక్కువ సమయంలో సులువుగా పైనాపిల్ హల్వాను చేసుకోవచ్చు.
పైనాపిల్ ముక్కలు - రెండు కప్పులు పంచదార - 200 గ్రాములు కోవా - అర కప్పు నెయ్యి - రెండు స్పూనులు యాలకుల పొడి - ఒక టీస్పూను జీడిపప్పులు - నాలుగు కిస్‌మిస్‌లు - ఎనిమిది
పైనాపిల్ పండ్లను చిన్న ముక్కలుగా కోసుకోవాలి.
స్టవ్ పై కళాయి పెట్టి నెయ్యి వేయాలి. అందులో పైనాపిల్ ముక్కలను వేసి వేయించాలి.
ముక్కలు కాస్త వేగి మెత్తగా అవుతాయి. ఆ సమయంలో పంచదార, కోవా ముద్ద కూడా వేసి బాగా కలపాలి.
యాలకుల పొడి, జీడిపప్పులు తురుములు కూడా వేసి బాగా కలపాలి.
అంతా దగ్గరగా ముద్దలా అయ్యేదాకా కలియబెట్టాలి. చివరగా కిస్‌మిస్‌లు చల్లి స్టవ్ కట్టేయాలి.
ఒక ప్లేటులో పైనాపిల్ హల్వాను వేసి ముక్కలుగా కోసుకోవాలి.