గుండెపోటు వచ్చే ముందు కనిపించే లక్షణాలు ఇవిగో...

వయసుతో సంబంధం లేకుండా గుండెపోటు దాడి చేస్తుంది.



గుండె పోటు వచ్చే ముందు కొన్ని లక్షణాల ద్వారా మనకు సంకేతాలు అందుతాయి.



గుండె పోటు రావడానికి కొన్ని రోజుల ముందు ఎడమ చేతిలో నొప్పిగా ఉంటుంది. ఎడమ భుజం నొప్పిగా, అసౌకర్యంగా అనిపిస్తుంది.



గుండెల మీద ఏదో బరువు మోస్తున్నట్టు అనిపిస్తుంది. ఇవన్నీ గుండెపోటు సంకేతాలే.



ఎడమ దవడలో కూడా అసౌకర్యంగా అనిపించడంతో పాటూ, నొప్పి మొదలవుతుంది.

శ్వాస తీసుకోవడం కాస్త ఇబ్బందిగా మారుతుంది. ఆయాసం తరచూ వస్తుంది.



నీరసంగా అనిపిస్తుంది. చిన్న పని కూడా చేయలేరు.

శరీరం చల్లగా మారిపోతుంది. ఒళ్లంతా చెమటలు పట్టేస్తాయి.

ఛాతీలో నొప్పిగా అనిపిస్తుంది. వికారంగా అనిపించడం, తలతిరగడం వంటివి కలుగుతాయి.