బుల్లితెరపై 'బాలిక వధు' సీరియల్ తో మంచి పాపులారిటీ సంపాదించుకుంది అవికా గోర్.

ఇదే సీరియల్ ను తెలుగులో 'చిన్నారి పెళ్లికూతురు'గా డబ్ చేయగా.. మంచి క్రేజ్ వచ్చింది.

దీంతో టాలీవుడ్ దర్శకనిర్మాతలు అవికా గోర్ ను హీరోయిన్ గా తీసుకోవడం మొదలుపెట్టారు.

ఈ క్రమంలో ఆమె నటించిన 'ఉయ్యాల జంపాల', 'సినిమా చూపిస్త మావ', 'ఎక్కడికి పోతావు చిన్నవాడా' లాంటి సినిమాలు మంచి విజయాలను అందుకున్నాయి.

ఈ మధ్యకాలంలో ఆమెకి సరైన సక్సెస్ రాలేదు.

మొన్నామధ్య ఈ బ్యూటీ నటించిన 'నెట్' సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

నాగచైతన్య నటించిన 'థాంక్యూ' సినిమాలో కీలకపాత్ర పోషించింది అవికా.

త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇది కాకుండా ఆమె చేతిలో మరో సినిమా లేదు.

కానీ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది ఈ బ్యూటీ. తాజాగా ఈమె షేర్ చేసిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి.