స్ట్రేంజర్ థింగ్స్ నాలుగో సీజన్ మొదటి భాగం ఇటీవలే నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల అయింది.
కథ: స్ట్రేంజర్ థింగ్స్ సీజన్ 3లో స్టార్ కోర్ట్ మాల్ ఫైట్ ముగిసిన ఆరు నెలల తర్వాత సీజన్ 4 ప్రారంభం అవుతుంది.
హాకిన్స్‌లో వెక్నా అనే కొత్త జీవి టీనేజర్లను చంపుతూ ఉంటుంది. దీంతోపాటు ప్రధాన పాత్రధారులందరి జీవితాల్లో మార్పులు వస్తాయి.
ఈ వెక్నా ఎవరు? అసలు మొదటి సీజన్‌లో హాకిన్స్ ల్యాబ్‌లో ఏం జరిగింది? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలియాలంటే సీజన్ 4 చూడాల్సిందే.
విశ్లేషణ: మొదటి మూడు సీజన్లలో ఉండే హార్రర్ ఎలిమెంట్స్ ఒక లెవల్లో ఉంటే... నాలుగో సీజన్ మాత్రం అంతకు మించి అనేలా ఉంటుంది.
రష్యాలో జిమ్ హోపర్, హాకిన్స్‌లో వెక్నా ట్రాక్, ఎలెవన్ ల్యాబ్ సీన్లు ఇలా మూడు ట్రాక్‌లు సమాంతరంగా నడిచినా ఎక్కడా కన్ఫ్యూజన్ ఉండదు.
సీజన్‌లో మొదటి ఆరు ఎపిసోడ్లు ఒక ఎత్తయితే... చివరి ఎపిసోడ్ మాత్రం వేరే లెవల్ అని చెప్పాలి.
అయితే అక్కడక్కడా కొన్ని బోరింగ్ సన్నివేశాలు కూడా ఉన్నాయి. కొన్ని సీన్లలో సుదీర్ఘంగా సంభాషణలు సాగడం దీనికి ప్రధాన కారణం.
నటీనటులందరూ తమ పాత్రలకు న్యాయం చేశారు.
హార్రర్, థ్రిల్లర్ లవర్స్‌కు స్ట్రేంజర్ థింగ్స్ కచ్చితంగా చూడాల్సిన వెబ్ సిరీస్.
(All Images Credits: Netflix)