రోజుకో గుడ్డు తింటే ఏమవుతుందంటే...

రోజుకో గుడ్డు తింటే ఎంతో ఆరోగ్యమని ఇప్పటికే ఆరోగ్యనిపుణులు చాలా సార్లు చెప్పారు.

గుడ్డు తరచూ తినేవారిలో గుండె జబ్బులు వచ్చే అవకాశం తక్కువని చెబుతోంది ఓ అధ్యయనం.

గుడ్డు తినని వారితో పోలిస్తే తినే వారిలో స్ట్రోక్ వచ్చే ప్రమాదం తక్కువగా ఉంటుంది.

గుడ్లను మితంగా తినే వ్యక్తుల రక్తంలో అపోలిపోప్రొట్రీన్ A1 అని పిలిచే ప్రోటీన్ అధిక స్థాయిలో ఉన్నట్టు గుర్తించారు. ఇది మంచి ప్రొటీన్ జాబితాలోకి వస్తుంది.

ఈ ప్రొటీన్ ఉన్న వ్యక్తులు తమ రక్తంలో అధిక స్థాయిలో హెచ్డిఎల్ అణువులను కలిగి ఉంటారు. గుండె ఆరోగ్యానికి హెచ్డిఎల్ చాలా అవసరం.

ఇది రక్త నాళాల నుంచి చెడు కొలెస్ట్రాల్ ను, కొవ్వును తొలగిస్తుంది. తద్వారా గుండెపోటు, స్ట్రాక్ వంటివి వచ్చే అవకాశం తగ్గుతుంది.

గుడ్డులో ఉండే మంచి ప్రొటీన్ వల్ల రక్తనాళాల్లో అడ్డంకులు ఏర్పడవు. దాని వల్ల గుండెకు ఎంతో మేలు జరుగుతుంది.

ఈ అధ్యయనాన్ని 4,778 మందిపై నిర్వహించారు.