అందాల భామ రెబా మోనికా జాన్ తన లేటెస్ట్ ఇన్స్టాగ్రామ్ వీడియోతో నెట్టింట సందడి చేస్తోంది.

ఇటీవల హాలిడే కోసం థాయిలాండ్ వెళ్లిన ఈ బ్యూటీ.. సోషల్ మీడియా వేదికగా అక్కడి విశేషాలను పంచుకుంటూ వస్తోంది.

తాజాగా ఫై ఫై దీవుల గురించి అభివర్ణిస్తూ అమ్మడు షేర్ చేసిన వీడియో, ఫోటోలు వైరల్ గా మారాయి.

ఇందులో రెబా థైస్ అందాలకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. వలపుల వయ్యారాలతో తెగ అట్రాక్ట్ చేస్తోందని కామెంట్లు పెడుతున్నారు.

ఫై ఫై ఐలాండ్స్ తనకు జీవితాంతం గుర్తుండిపోయే జ్ఞాపకాలను అందించిందని రెబా చెబుతోంది.

ఈ ట్రిప్ లో తనకు ఎంతో ఇష్టమైన ఫ్రెండ్స్ తో కలిసి అలాంటి మ్యాజిక్ ను అనుభవించడం ఎప్పటికీ మర్చిపోలేనని పేర్కొంది.

2016 లో ‘జాకోబింటే స్వర్గరాజ్యం’ అనే మలయాళ చిత్రం ద్వారా హీరోయిన్‌ గా తెరంగేట్రం చేసింది రెబా మోనికా.

బెంగళూరులో పుట్టి పెరిగినా, ఎక్కువగా తమిళ మలయాళ చిత్రాల్లో అవకాశాలు అందుకుంది.

'సామజవరగమన' సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ.. అందం, అభినయంతో తెలుగు ప్రేక్షుకులను ఆకట్టుకుంది.

2022లో తన బాయ్‌ ఫ్రెండ్‌ జోమోన్ జోసెఫ్‌ ను వివాహం చేసుకున్న రెబా.. పెళ్లి తర్వాత కూడా సినిమాలు చేస్తోంది.

ప్రస్తుతం 'రజిని' అనే మలయాళ చిత్రంతో పాటుగా 'అక్టోబర్ 31స్ట్ లేడీస్ నైట్' అనే తెలుగు తమిళ బైలింగ్వల్ మూవీ చేస్తోంది.