సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండే యాంకర్ విష్ణు ప్రియ.. 'కల్ట్ మామా కల్ట్ మామా' అంటూ ఇంటర్నెట్ ను షేక్ చేస్తోంది.

రామ్ హీరోగా నటించిన 'స్కంద' చిత్రంలోని వైరల్ ఐటెం సాంగ్ 'కల్ట్ మామ' కు తనదైన శైలిలో స్టెప్పులేసింది.

ఒరిజినల్ సాంగ్ లో ఐటెం భామగా ఆడిపాడిన ఊర్వశీ రౌతేలా రేంజ్ లో బాడీ మొత్తాన్ని ఓ ఊపు ఊపేసింది.

బ్లూ కలర్ డ్రెస్ లో అందాలను ఆరబోస్తూ, అమ్మడు వేసే ఎనర్జిటిక్ డ్యాన్సులకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు.

కామెంట్ల వర్షం కురిపిస్తూ, యంగ్ బ్యూటీకి 'కల్ట్ పాప' 'కల్ట్ బేబీ' అంటూ కొత్త కొత్త బిరుదులు ఇచ్చేస్తున్నారు.

కల్ట్ స్టెప్పులతో అదరగొట్టిన విష్ణుప్రియ భీమినేని 'కల్ట్ మామా' డ్యాన్స్ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.

యూట్యూబర్ గా కెరీర్ ప్రారంభించిన విష్ణు ప్రియ.. బుల్లితెరపై అడుగుపెట్టకముందే పలు షార్ట్ ఫిలిమ్స్ చేసింది.

'పోరా పోవే' అనే కామెడీ షోతో యాంకర్ గా గుర్తింపు తెచ్చుకుని, సినిమాల్లో అవకాశాలు అందుకుంది.

ఛాన్స్ వచ్చినప్పుడల్లా సినిమాల్లో నటిస్తూనే, మరోవైపు టీవీ షోలతో అలరిస్తోంది.

ఇటీవల 'దయ' అనే వెబ్ సిరీస్ లో క్రైమ్ జర్నలిస్ట్ గా నటించి మెప్పించింది విష్ణుప్రియ.

ప్రస్తుతం పలు సినిమాలతో పాటుగా వెబ్ సిరీస్ లలో నటిస్తోందీ హైదరాబాదీ అమ్మాయి.