సైమా అవార్డ్స్-2023 లో రెండు పురస్కారాలతో సందడి చేసింది అందాల భామ మృణాల్ ఠాకూర్. 'సీతా రామం' సినిమాకు గాను 'ఉత్తమ నటి' (క్రిటిక్స్) & 'బెస్ట్ ఫిమేల్ డెబ్యూ' అవార్డులు గెలుచుకుంది. సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ కు సంబంధించిన గ్లింప్స్ ను ఇన్స్టాలో పంచుకుంది. ఈ సందర్భంగా తనను ఆదరించిన తెలుగు ఆడియన్స్ కు మృణాల్ కృతజ్ఞతలు తెలిపింది. ట్రెండీ కాస్ట్యూమ్స్ లో అమ్మడు సైమా అవార్డ్స్ ఈవెంట్ లో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. అంతేకాదు దుబాయ్ వేదికగా స్టేజ్ పెర్ఫార్మన్స్ చేసి, తన డ్యాన్స్ లతో అందరి దృష్టిని ఆకర్షించింది. మెరూన్ డ్రెస్ లో మెరిసిపోతున్న మృణాల్ ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. 'సీతారామం'తో యువ హృదయాలను కొల్లగొట్టిన ఈ బ్యూటీ.. తెలుగులో క్రేజీ ఆఫర్స్ తో దూసుకుపోతోంది. నానికి జోడీగా 'హాయ్ నాన్న' లో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రం డిసెంబర్ 21న విడుదల కానుంది. అలానే #VD13 మూవీలో విజయ్ దేవరకొండతో రొమాన్స్ చేయడానికి రెడీ అయింది మృణాల్.