సాయి పల్లవి అందం వెనుక రహస్యం అదే మల్లెతీగలా నాజూగ్గా ఉంటుంది సాయిపల్లవి. కానీ ఆమె ఇంతవరకు జిమ్ లో అడుగు పెట్టలేదు. తన నాజూకుతనం వెనుక అసలు రహస్యం డ్యాన్సే అని చాలా సార్లు చెప్పింది సాయి పల్లవి. రోజూ అందరూ జిమ్ కు వెళ్లి వర్కవుట్స్ చేస్తే, తాను మాత్రం డ్యాన్స్ చేస్తానని చెప్పింది. ఒంట్లో ఎముకలున్నాయా అని చూసేవాళ్లు ఆశ్చర్యపోయేలా డ్యాన్సు చేస్తుంది సాయి పల్లవి. ఇంతబాగా డ్యాన్స్ చేస్తున్నా... ఇంతవరకు ఆమె ఎక్కడా డ్యాన్సు నేర్చుకోలేదు. చిన్నప్పట్నించి తనకు నచ్చినట్టుగా డ్యాన్సు వేసేది. అందువల్లే ఆమె శరీరం ఫ్లెక్సిబుల్ గా తయారైంది. టాలీవుడ్ లో అద్భుతంగా డ్యాన్సు చేసే హీరోయిన్లలో ఆమెదే మొదటిస్థానం. ఫిట్‌నెస్ కోసం జిమ్ కి వెళ్లాల్సిన అవసరం లేదని, ఇంట్లో రోజూ గంట పాటూ డ్యాన్స్ చేసినా చాలని చెబుతోంది ఈ రౌడీ బేబి.