మహేష్ బాబు జీవితంలో చీకటి ఏడాదిగా మిగిలిపోతుంది. ఈ ఒక్క ఏడాది ఆయనకు ఎంతో ఆప్తులైన ముగ్గురు మరణించారు. మహేష్ తండ్రి, సూపర్ స్టార్ కృష్ణ నవంబర్ 15న మరణించారు. మహేష్ అన్నయ్య, ఒకప్పటి హీరో రమేష్ బాబు ఈ ఏడాది జనవరి 8న కన్ను మూశారు. మహేష్ మాతృమూర్తి ఇందిరా దేవి సెప్టెంబర్ 27న తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. మహేష్ బాబుకు తల్లిదండ్రులు అంటే ఎంతో ప్రేమ. తనకు తల్లి దైవంతో సమానం అని మహేష్ చెబుతూ ఉండేవారు. తల్లిదండ్రులు, అన్నయ్య మరణం మహేష్ బాబును తీవ్రంగా కలిచివేసిందని సినీ ప్రముఖులు చెబుతున్నారు. ఇందిరా దేవి మరణించినప్పుడు మహేష్ కుమార్తె సితార వెక్కివెక్కి ఏడ్చారు. (All Images Courtesy : Mahesh Instagram / Social Media) కుమార్తె కంటే ఎక్కువ దుఃఖం మహేష్ బాబులో ఉందని, ఆయన బయటకు కనపడనివ్వడం లేదట. విజయ నిర్మల జూన్ 27, 2019న మరణించారు. ఆవిడ మరణం ఘట్టమనేని ఫ్యామిలీలో మరో విషాదం