రీసెంట్ గా రిలీజైన 'బేబీ' మూవీకి మంచి రెస్పాన్స్ వస్తోంది. సాయి రాజేష్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో ఆనంద దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా నటించారు. రిలీజ్ కు ముందే విడుదలైన టీజర్, ట్రైలర్, సాంగ్స్, ప్రమోషన్స్ తో మూవీపై ఆడియన్స్ లో మంచి బజ్ క్రియేట్ అయింది. ఇప్పుడు 'బేబీ'కి పాజిటివ్ టాక్ రావడంతో విజయ్ దేవరకొండ సంతోషం వ్యక్తం చేస్తున్నాడు. తమ్ముడు ఆనంద్‌కు, వైష్ణవికి టైట్ హగ్ ఇచ్చి తన ఆనందాన్ని వ్యక్తం చేశాడు. స్కూల్ కాలేజ్ డేస్ లో జరిగే లవ్ స్టోరీని సినిమాలో రియాలిస్టిక్ గా చూపించే ప్రయత్నం చేశారు. ప్రస్తుతం థియేటర్స్ లో సందడి చేస్తున్న ఈ సినిమా ఓటీటీ రైట్స్ భారీ ధరకు అమ్ముడైనట్టు తెలుస్తోంది. ఓ చిన్న సినిమాకు ఈ రేంజ్ లో బిజినెస్ జరగడం ఇప్పుడు సర్వత్ర ఆసక్తికరంగా మారింది. Image Credits : Twitter