హాట్ బ్యూటీ అనసూయ భరద్వాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బుల్లితెరకు గ్లామర్ అద్దిన అతికొద్దిమంది యాంకర్లలో అనసూయ ఒకరు. యాంకర్ గా కెరీర్ ను స్టార్ట్ చేసిన ఈ భామ.. తన అందచందాలతో యువ హృదయాలను కొల్లగొట్టింది. టీవీ షోలలో తన హాట్ నెస్ తో అదరగొట్టే ఈ యాంకరమ్మకు సినిమాల్లోనూ మంచి ఆఫర్స్ వచ్చాయి. 2003లో 'నాగ' చిత్రంలో తెరంగేట్రం చేసిన అనసూయ.. 2016లో 'సోగ్గాడే చిన్ని నాయనా'తో రీఎంట్రీ ఇచ్చింది. 'క్షణం' చిత్రంలో విలన్ గా మెప్పించింది.. 'రంగస్థలం' సినిమాలో రంగమ్మత్తగా ఆకట్టుకుంది. 'పుష్ప'తో భారీ క్రేజ్ సంపాదించుకున్న అనసూయ.. వరుసగా క్రేజీ ఆఫర్స్ అందుకుంది. ఈ క్రమంలో కొన్ని ఐటమ్ సాంగ్స్ కూడా చేసింది. సోషల్ మీడియాలో ఎంతో యాక్టీవ్ గా ఉండే ఈ బ్యూటీ.. హాట్ ఫోటోలు, వీడియోలతో నెట్టింట సందడి చేస్తుంది. పెళ్ళై ఇద్దరు కొడుకులు ఉన్నప్పటికీ, తన హాట్ అందాలతో నెటిజన్లకు మత్తెక్కిస్తుంది. ప్రస్తుతం హాలిడేని ఎంజాయ్ చేస్తున్న అనసూయ.. తన లేటెస్ట్ రీల్స్, ఫోటోలతో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.