2023 వరల్డ్ కప్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టిన లిస్ట్‌లో రోహిత్ శర్మ, మ్యాక్స్‌వెల్ టాప్‌లో ఉన్నారు. రోహిత్ శర్మ, గ్లెన్ మ్యాక్స్‌వెల్ చెరో 22 సిక్సర్లు బాదేశారు. 20 సిక్సర్‌లతో మూడో స్థానంలో ఉన్న డేవిడ్ వార్నర్. తర్వాత స్థానాల్లో క్వింటన్ డికాక్ (18), ఫకర్ జమాన్ (18) ఉన్నారు. అన్ని ఫార్మాట్లలో అత్యధిక సిక్సర్లు కొట్టిన ఆటగాడిగా రోహిత్ రికార్డు సృష్టించాడు. 554 సిక్సర్లతో క్రిస్ గేల్ రికార్డు చెరిపేసిన రోహిత్ శర్మ. గేల్ 551 ఇన్నింగ్స్‌ల్లో 553 సిక్సర్లు బాదగా రోహిత్ 473 ఇన్నింగ్స్‌ల్లోనే 554 సిక్సులు బాదాడు. ఈ టాప్ టెన్ సిక్సర్స్ లిస్ట్‌లో బట్లర్, రోహిత్ తప్ప మిగిలిన వారంతా రిటైర్డ్ ప్లేయర్లే.