2023 ప్రపంచ కప్‌లో టీమిండియా దూసుకుపోతుంది. ఇప్పటివరకు ఒక్క మ్యాచ్‌లో కూడా ఓడిపోలేదు. ఆడిన 10 మ్యాచ్‌ల్లోనూ ఘనవిజయాలు సాధించింది. ఇందులో కెప్టెన్ రోహిత్ శర్మది కీలక పాత్ర అని చెప్పవచ్చు. ఈ ప్రపంచ కప్‌లో రోహిత్ శర్మ కెప్టెన్సీ అద్భుతం. కేవలం కెప్టెన్సీలోనే కాకుండా బ్యాటింగ్‌లో కూడా అద్భుతంగా ఆడాడు. ఈ ప్రపంచ కప్‌లో రోహిత్ 550 పరుగులు చేశాడు. తన స్ట్రైక్ రేట్ ఏకంగా 130కి పైగా ఉండటం విశేషం. ప్రతి మ్యాచ్‌లోనూ భారత్‌కు రోహిత్ అద్భుత ఆరంభాన్ని ఇచ్చాడు. ఆ పునాదిపై మిగతా బ్యాటర్లు భారీ స్కోరు సాధించేవారు.