రాకింగ్ రాకేష్, జోర్దార్ సుజాత పెళ్లి వేడుక - రెండు కళ్లు సరిపోవు!

‘జబర్దస్త్’ కామెడీ షో చూసేవారికి రాకింగ్ రాకేష్ పరిచయమే.

ఈ షోలో పరిచయమైన ‘జోర్దార్’ సుజాతతో రాకేష్ ప్రేమలో పడ్డాడు.

ఈ నెల 25న తిరుపతిలో సుజాతాను పెళ్లి చేసుకున్నాడు.

తాజాగా రాకేష్, సుజాత తమ హల్దీ వేడుక ఫొటోలను ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు.

కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల సమక్షంలో వీరి పెళ్లి ఘనంగా జరిగింది.

వీరి పెళ్లి ఫోటోలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

రాకేష్ పెళ్లికి ‘జబర్దస్త్’ నుంచి తోటి కమెడియన్లు, టీవీ నటీనటులు హాజరయ్యారు.

ఏపీ మంత్రి రోజా, ఆమె భర్త సెల్వామణి సైతం హాజరై వధువరులను ఆశ్వీరదించారు.

‘జబర్దస్త్’లో ప్రసారమైన తాజా స్కిట్‌లో కూడా సుజాతా, రాకేష్ తమ పెళ్లి గురించి ప్రకటించారు.

- Images Credit: Rocking Rakesh/Instagram