ఈ వారం ఆర్జే సూర్య అవుట్?

మిమిక్రీలో మంచి ఆర్టిస్టు ఆర్జే సూర్య.

బిగ్‌బాస్ ఆట కన్నా ఆరోహి, ఇనయాలతోనే ఎక్కువ ఆడుకున్నాడు సూర్య.

సూర్య గట్టిగా ఆడిన టాస్కులు ఒక్కటి లేదు. పోనీ తన కోసం గట్టిగా వాదించిన సందర్భం కూడా లేదు.

అందువల్లే ఆయన ఎనిమిదో వారం ఎలిమినేట్ అయినట్టు తెలుస్తోంది.

ప్రభాస్, రామ్ చరణ్, అల్లు అర్జున్, చిరంజీవి... ఇలా స్టార్ హీరోలందరి గొంతులు ఇట్టే మిమిక్రీ చేస్తాడు.

చాలా సార్లు తనకున్న టాలెంట్‌తో ఇంటి సభ్యులను అలరించడమే కాదు, కొన్ని ఎపిసోడ్‌లను కూడా ముందుకు నడిపించాడు.

ముఖ్యంగా పుష్పరాజ్ క్యారెక్టర్లో ఆయన జీవించాడు.

ఆర్జే సూర్య ఫ్రెండు బుజ్జిమా కూడా ఈయన వల్ల బాగా ఫేమస్ అయ్యింది.