బొద్దుగుమ్మ నిత్యా మీనన్ షాకింగ్ విషయాన్ని చెప్పింది. తాను ప్రెగ్నెంట్ అంటూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టింది. తనకు ప్రెగ్నెన్సీ పాజిటివ్ వచ్చినట్లుగా కిట్ ను షేర్ చేసింది. ప్రెగ్నెన్సీ పోస్టుకు 'ది వండర్ బిగిన్స్' అంటూ క్యాప్షన్ ఇచ్చింది. నిత్యా పోస్టు చూసి ఫ్యాన్స్ షాక్ అయ్యారు. నిత్యా నిజంగానే ప్రెగ్నెంటా? అంటూ కామెంట్స్ చేశారు. సినిమా ప్రమోషన్స్ కోసం ఈ పోస్ట్ పెట్టి ఉంటుందని మరికొందరు అభిప్రాయపడ్డారు. తాజాగా ప్రెగ్నెన్సీ వెనుక అసలు విషయాన్ని చెప్పింది. త్వరలో విడుదల కానున్న ఓ మూవీ కోసం ఇలా ప్రాంక్ చేసిందట. Photos & Video Credit: Nithya Menen /Instagram/twitter