తలనొప్పి వచ్చినప్పుడు ఇలా చేయండి



ఒత్తిడి వల్ల, పనుల వల్ల తరచూ కొందరికీ తలనొప్పి వస్తూనే ఉంటుంది.



అలాంటివారు కొన్ని పనులు చేస్తే ఉపశమనం దక్కుతుంది.



తలకు మసాజ్ చేయడం వల్ల కండరాలకు ఫ్రీ అవుతాయి. నొప్పి తగ్గుతుంది.



ఐస్ ప్యాకులతో తలపై రుద్దుకోవడం వల్ల మంచి ఫలితం కలుగుతుంది.



చిన్న చేతిసంచిలో బియ్యం వేసి మూట కట్టాలి. స్టవ్ మీద కళాయి పెట్టి ఆ మూటను అందులో పెట్టి వేడెక్కేలా చేయాలి. ఆ గోరువెచ్చని మూటను తీసి తలపై రుద్దుకున్నా నొప్పి తగ్గుతుంది.



లావెండర్ నూనెతో తలకు మర్ధనా చేసుకోవాలి.



డీహైడ్రేషన్ వల్ల తలనొప్పి వచ్చే అవకాశం ఉంది. వెంటనే నీళ్లు తాగండి.



గట్టిగా ఊపిరి తీసుకుని, వదులుతూ ఉండాలి.



సమయం ఉంటే కాసేపు నిద్రపోండి.