ఎర్రబెండకాయలు తింటున్నారా? లేదా? ఆకుపచ్చ రంగులో ఉండే బెండకాయలు అందరికీ తెలిసినవే, కానీ ఎర్ర బెండకాయలు కూడా ఉన్నాయి. ఈ ఎర్ర బెండకాయలు తినడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఇవి చాలా అరుదుగా పండిస్తూ ఉంటారు. డయాబెటిస్ బారిన పడినవారు ఎర్ర బెండకాయలను తింటూ ఉంటే ఎంతో ఆరోగ్యం. అధిక రక్తపోటుతో బాధపడుతున్న వారు కొలెస్ట్రాల్ సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారు కూడా ఎర్ర బెండకాయను తరచూ తింటూ ఉండాలి. గుండె జబ్బుల బారిన పడినవారు గుండె జబ్బులు రాకుండా జాగ్రత్త పడాలి అనుకుంటున్నవారు కూడా ఎర్ర బెండకాయ కు ప్రాధాన్యత ఇవ్వాలి. సాధారణ బెండకాయతో ఎలాంటి వంటకాలు వండుతారో అవన్నీ కూడా ఎర్ర బెండకాయతో వండుకోవచ్చు. దీనిలో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఎర్ర బెండకాయ తింటే మలబద్ధకం సమస్యలు, గ్యాస్ట్రిక్ సమస్యలు తొలగిపోతాయి. ఈ బెండకాయలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి శరీరాన్ని కాపాడతాయి.