చికెన్, మటన్ కన్నా చేపలు తినడమే బెటర్



పోషకాహార నిపుణులు చెబుతున్న ప్రకారం చికెన్, మటన్ కన్నా చేపలే తినాలని సూచిస్తున్నారు.



ఏదో ఒక రూపంలో చేపలను ఆహారంలో భాగం చేసుకోవాలని, వారంలో రెండు నుంచి మూడు సార్లు తీసుకుంటే మంచిదని చెబుతున్నారు.



చికెన్, మటన్ అధికంగా తింటే శరీరంలో కొలెస్ట్రాల్ పేరుకు పోతుంది, చేపలు తినడం వల్ల అలా జరగదు.



చేపలు తినడం వల్ల శరీరంలో డోపమైన్, సెరటోనిన్ అనే హార్మోన్లు విడుదలవుతాయి. ఇవి మానసిక ఆరోగ్యాన్ని కాపాడతాయి.



ఒత్తిడి, మానసిక ఆందోళన వంటివి తగ్గించడంలో ముందుంటాయి.



ఎవరైతే చేపలను అధికంగా తింటారో, వారు వయసు పెరిగాక మతిమరుపు వ్యాధి బారిన తక్కువగా పడతారు.



చేపలు తరచూ తినేవారిలో దృష్టి సమస్యలు తక్కువగా వస్తాయి.



వీటిని తినడం వల్ల గుండెజబ్బులు వచ్చే అవకాశం కూడా తగ్గిపోతుంది.