సాయంత్రం సమయంలో స్నాక్స్ తింటే ఆ కిక్ వేరు ఉంటుంది.

ముఖ్యంగా వర్షం వచ్చే సమయంలో క్రిస్పీగా ఏమైనా తింటే అదిరిపోతుంది.

ఇంట్లోనే సింపుల్​గా చేసుకోగలిగే పనీర్ పాప్​ కార్న్ ఈవెనింగ్ స్నాక్​కి మంచి ఆప్షన్.

రెస్టారెంట్ స్టైల్​లో దీనిని ఎలా చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

ఓ కప్పులో మైదా, సాల్ట్, చిల్లీ ఫ్లేక్స్, మిక్స్డ్ హెర్బ్స్ వేసి కలుపుకోవాలి.

తగినంత నీరు వేసి పిండిని ఉండలు లేకుండా కలుపుకోవాలి.

ఇప్పుడు వాటిలో పనీర్ వేయండి. పనీర్​కు పిండి బాగా అంటుకోవాలి.

అనంతరం వాటిని బ్రెడ్ క్రంబ్స్​లో వేసి కోట్ చేసి అరగంట ఫ్రిజ్​లో ఉంచాలి.

ఇప్పుడు స్టౌవ్ వెలిగించి.. దానిపై కడాయి పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేయాలి.

గోల్డెన్ బ్రౌన్​ వచ్చేవరకు వేయించుకోవాలి. అంతే టేస్టీ పనీర్ పాప్​ కార్న్ రెడీ. (Images Source : Envato)