రుచికరమైన పెసరపప్పు పాపడ్ ఇంట్లోనే ఇలా తయారు చేసుకోండి!

Published by: RAMA
Image Source: pixabay

పెసరపప్పుతో రుచికరమైన పాపడ్ ఎలా తయారు చేయాలో తెలిస్తే... మార్కెట్లో దొరికే పాపడ్ తినడం మర్చిపోతారు.

Image Source: pixabay

నాణ్యత గల కడిగిన పెసర పప్పు తీసుకోండి. మెత్తగా మిక్సీ పట్టుకుని జల్లెడ పట్టుకోండి

Image Source: pixabay

1 టీస్పూన్ పాపడు క్షారం ఉపయోగించండి, ఇది బైండింగ్, కరకరలాడేందుకు అవసరం.

Image Source: pixabay

పిండిలో 1 టీస్పూన్ జీలకర్ర, 1/2 టీస్పూన్ కచ్చాగా దంచిన మిరియాలు, 1/4 టీస్పూన్ ఇంగువ రుచికి సరిపడా ఉప్పు వేసి కలపండి.

Image Source: pixabay

పాపడ్ పిండిని వేడి నీటితో కలిపి మెత్తగా చేయండి. ఇది పిండిని సాగేలా చేస్తుంది ..పాపడ్ పగలదు.

Image Source: pixabay

పిండిని కలిపిన తర్వాత, అందులో 1-2 టీస్పూన్ల నూనె వేసి, బాగా 10 నుంచి 15 నిమిషాల వరకు కలపండి

Image Source: pixabay

తయారు చేసిన పిండిని తడి గుడ్డతో లేదా మస్లిన్ గుడ్డతో కప్పి అరగంట పాటు ఉంచండి.

Image Source: pixabay

చిన్న ఉండలు తీసుకోండి, కొద్దిగా నూనె లేదా పొడి పిండి వేసి వీలైనంత పలుచగా చుట్టండి

Image Source: pixabay

ఈ పాపడ్లను 4-5 రోజుల పాటు ఎండలో ఆరబెట్టండి తరువాత వాటిని గాలి చొరబడని డబ్బాలో నిల్వ చేయండి

Image Source: pixabay