గులాబీ పువ్వుల హల్వా ఇంట్లో ఈజీగా చేసేయొచ్చు!

Published by: RAMA
Image Source: Pexels

హల్వా అందరికీ ఇష్టం, ఒక్కొక్కరు ఒక్కో రకం హల్వా తయారు చేస్తారు.

Image Source: Pexels

వాటిలో ఒకటి గులాబీ పువ్వుల హల్వా, మీరు ఎప్పుడైనా తిన్నారా?

Image Source: Pexels

ఇప్పటివరకూ గులాబీ పువ్వుల హల్వా తిని ఉండకపోతే..ఇంట్లో తయారు చేసుకోండి చాలా ఈజీ

Image Source: Pexels

మొదట ఒక కడాయిలో నెయ్యి వేడి చేయండి, అందులో సూజీ వేసి, తక్కువ మంట మీద బంగారు రంగు వచ్చే వరకు వేయించండి.

Image Source: Pexels

మరొక పాత్రలో పాలు వేడి చేసి పంచదార వేసి కలపండి..అందులో రోజ్ వాటర్, కుంకుమపువ్వు వేసి 2-3 నిమిషాలు ఉడకనివ్వండి.

Image Source: Pexels

రవ్వలో కొద్ది కొద్దిగా పాలు పోసి కలపండి, ఇది గట్టిపడే వరకు ఉడికించాలి

Image Source: Pexels

ఎండిన గులాబీ రేకులు కత్తిరించి యాలకుల పొడిని కలపండి.

Image Source: Pexels

గట్టిపడిన రవ్వలో గులాబీ రేకులు యాలకుల పొడి మిశ్రమం వేయండి..మూతపెట్టి మరో 5 నిమిషాల వరకు ఉడికించండి

Image Source: Pexels

తయారు చేసిన గులాబి హల్వాను వేడిగా లేదా చల్లగా ఎలా తిన్నా టేస్ట్ అదిరిపోతుంది

Image Source: Pexels

హల్వా పైన మరిన్ని గులాబీ రెక్కలు వేయడం మర్చిపోవద్దు..