ఊరి పేరుతో ఫేమస్ అయిన మైసూర్ పాక్ ఎలా పుట్టిందో తెలుసా

మైసూర్ రాజ కుటుంబ అంతఃపురం వంటగాడైన కాకాసుర మడప్ప మైసూర్ పాక్ చేసిన తొలి వ్యక్తి

మైసూర్ 24వ మహారాజు 4వ కృష్ణారాజ వడయార్ కోసం కాకాసుర మడప్ప ఈ వంటకం చేసి మెప్పించారు

నెయ్యి, శనగపిండి, పంచదార, యాలకులు కలిపి చేసిన స్వీట్ రాజుగారికి చాలా నచ్చి పేరేంటి అని అడిగారు

మడప్పకు ఏం చెప్పాలో తెలియక మైసూర్ పాక్ అని రాజుకు చెప్పాడు. అదే మైసూర్ పాక్‌గా ఫేమస్ అయింది

మైసూర్ మహారాజు సూచనతో కాకాసుర మడప్ప ప్రారంభించిన గురు స్వీట్స్లో ఎప్పుడూ రద్దీ ఉంటుంది

మైసూర్ ప్యాలెస్ దగ్గర్లోని దేవరాజ మార్కెట్లో ఈ గురు స్వీట్ షాపు ఉంటుంది.

ఒరిజినల్ మైసూర్ పాక్ తో పాటు 7 ఫ్లేవర్ లలో ఈ స్వీట్ తయారు చేస్తున్నారు

కాకాసుర మడప్ప కుటుంబంలోని 5వ తరం వారసులు ఈ షాపును నడుపుతున్నారు.

కాకాసుర మడప్ప కుటుంబంలోని ప్రస్తుత వారసుడు శివానంద ఈ షాపును నడుపుతున్నారు.