అదేంటి రైస్​ లేకుండా ఫ్రైడ్​ రైస్​ని చేయొచ్చా? వింటానికి విడ్డూరంగా ఉంది కదూ.

కానీ అదేమి పెద్ద విషయం కాదు. రైస్​ లేనప్పుడు ఇంట్లో ఉండేవాటితో ఫ్రైడ్ రైస్ చేసుకోవచ్చు.

ఇంతకీ రైస్​ లేకుండా ఫ్రైడ్ రైస్​ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం.

ముందుగా వెల్లుల్లిని, ఉల్లిపాయల్ని చిన్నగా తురిమి పక్కన పెట్టుకోవాలి.

క్యాప్సికమ్, బీన్స్​లను కూడా చిన్నగా కట్ చేసుకోవాలి. క్యారెట్​ పై తొక్క తీసేసి కట్ చేసుకోవాలి.

అటుకులను నీటిలో కడిగి పక్కన పెట్టేయాలి. నానబెట్టకూడదు. గట్టిగా పిసికి కడగకూడదు.

ఇప్పుడు స్టౌవ్ వెలిగించి కడాయి పెట్టండి. దానిలో నూనె వేసి వేడి అయ్యాక వెల్లుల్లి వేయాలి.

అనంతరం ఉల్లిపాయలు వేయాలి. అవి కాస్త వేగాక బీన్స్, క్యాప్సికమ్, క్యారెట్ వేయాలి.

అవి సగం ఉడికితే సరిపోతుంది. ఇప్పుడు అటుకులు వేసి అన్ని బాగా కలిసేలా కలపాలి.

రుచికి తగనంత సాల్ట్, సోయాసాస్, వెనిగర్ వేసుకుని మరోసారి బాగా కలిపాలి.

అంతే టేస్టీ ఫ్రైడ్ రైస్ రెడీ. (Images Source : Envato)