అమెరికాలో ప్రభాస్ ఫ్యాన్స్ క్రేజీ కార్ ర్యాలీ ప్రభాస్, దీపికా పదుకొనే జంటగా నటిస్తున్న భారీ బడ్జెట్ సినిమా ‘ప్రాజెక్ట్-K’. ఈ మూవీకి నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్నాడు. అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ వంటి భారీ తారాగణంతో ఈ మూవీ తెరకెక్కుతున్నది. త్వరలోనే ‘ప్రాజెక్ట్-కె’ టైటిల్, గ్లింప్స్ ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. అమెరికా శాన్ డియాగోలో జులై 20న టైటిల్ ప్రకటించనున్నారు మేకర్స్. ఈ నేపథ్యంలో ప్రభాస్ ఫ్యాన్స్ క్రేజీ కార్ ర్యాలీ నిర్వహించారు. Photos & Video Credit: projectk_film/Instagram