బచ్చలిలో పోషకాలు అధికంగా ఉండడం వల్ల చలికాలంలో తినడం చాలా ఉపయోగకరంగా ఉంటుంది. రోగ నిరోధక శక్తి మెరుగవుతుంది. ఐరన్ ఎక్కువ కనుక రక్త వృద్ధికి తోడ్పడుతుంది. కాల్షియం, విటమిన్-K ఉండడం వల్ల ఎముకల ఆరోగ్యంగా ఉంటాయి. దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడకుండా నిరోధిస్తుంది. ఫైబర్ ఎక్కువ కనుక జీర్ణవ్యవస్థ ఆరోగ్యానికి దోహదం చేస్తుంది. విటమిన్-A ఉంటుంది కనుక చర్మ కణాల రిపేర్ చేసేందుకు తోడ్పడుతుంది. Representational Image : Pexels