ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు కలిగిన బచ్చలి, బ్రొకోలి, కాలిఫ్లవర్, బీన్స్, క్యాబెజి, క్యాప్సికం రక్తంలో చక్కెర స్థాయిని అదుపులో ఉంచుతాయి. పండ్లు : ఆపిల్స్, ఆరెంజ్, రేగు, కివి, బొప్పాయి, నేరెడు పైబర్‌తో తక్కువ చక్కెర కలిగి ఉంటాయి. జీర్ణక్రియను మెరుగు పరుస్తాయి. ప్రొటీన్లు : ఆకలి తగ్గించి, శరీర బరువును అదుపులో పెడతాయి. చికెన్, గుడ్డు, టోఫు లో ఉండే ప్రొటీన్ కండరాలను బలోపేతం చేస్తుంది. ఫైబర్ పుష్కలంగా ఉండే తృణధాన్యాలు జీర్ణ వ్యవస్థ, గుండె ఆరోగ్యానికి దోహద పడతాయి. లెగ్యూమ్స్ : ప్రొటీన్, ఫైబర్ కలిగిన శనగ, రాజ్మా, కిడ్నీ బీన్స్ రక్తంలో చక్కెర స్తాయిలను అదుపులో ఉంచుతాయి. పాల ఉత్పత్తులు : కాల్షియం, విటమిన్ డి కలిగిన పాల ఉత్పత్తులు కండరాలు, ఎముకల దృఢత్వానికి అవసరం. కొవ్వులు : ఆలివ్ నూనె, అవకాడో, బాదం, వాల్ నట్, అవిసెగింజలు వంటి ఆరోగ్యకరమైన కొవ్వులు ఇన్సులిన్ సెన్సిటివిని పెంచుతాయి. representational Image : Pexels