అరగంట నడకతో ఎన్నో లాభాలున్నాయని నిపుణులు చెబుతున్నారు. అవేమిటో తెలుసుకుందాం. కాలరీల ఖర్చు : చురుకుగా అరగంట నడిస్తే 150 - 250 వరకు కేలరీలను బర్న్ చెయ్యవచ్చు. వారానికి 5 రోజులు రోజుకు 30 నిమిషాలు స్థిరంగా నడచినా గుండె ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. బరువు తగ్గాలంటే నడకతో పాటు తీసుకునే ఆహారం మీద కూడా శ్రద్ధ పెట్టాలి. అరగంట పాటు చురుకుగా నడవడం ముఖ్యం. చిన్నచిన్న విరామాలు తీసుకున్నా ఫర్వాలేదు. కానీ ఇంటెన్సిటి ముఖ్యం. కొంత కాలానికి ఈ వర్కవుట్ కి మీ శరీరం అలవాటు పడుతుంది. మరింత బరువు తగ్గేందుకు నడక వేగం పెంచడం లేదా మరోరకమైన వర్కవుట్ ను నడకతో పాటు చెయ్యడం అవసరం. నడకతో బరువు తగ్గాలనుకుంటే తప్పకుండా సమతుల ఆహారం తీసుకోవాలి. నడక ఇంటెన్సిటీ, ఇంటర్వెల్స్ కూడా ముఖ్యమని మరచిపోవద్దు. Representational Image : Pexels