స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్, గ్యాంగ్‌స్ట‌ర్ డ్రామా, యూత్‌ఫుల్ రొమాంటిక్ కామెడీ... ఈ వారం థియేటర్లు, ఓటీటీల్లో విడుదలవుతున్న సినిమాలు!

తెలుగు, తమిళ భాషల్లో ఫిబ్రవరి 10న అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో 'మహాన్'. విక్రమ్, ఆయన తనయుడు ధృవ్ విక్రమ్ నటించిన చిత్రమిది.

మాస్ మహారాజ రవితేజ 'ఖిలాడి' ఫిబ్రవరి 11న థియేటర్లలో విడుదల కానుంది.

ఆహా ఓటీటీలో ప్రియమణి ప్రధాన పాత్రలో నటించిన 'భామా కలాపం' ఫిబ్రవరి 11న విడుదల.

హర్ష్‌ కనుమిల్లి, సిమ్రాన్‌ చౌదరి జంటగా నటించిన 'సెహరి' కూడా ఫిబ్రవరి 11న థియేటర్లలో విడుదల కానుంది.

సుమంత్ హీరోగా నటించిన 'మళ్ళీ మొదలైంది' జీ 5 ఓటీటీలో 11న విడుదల కానుంది.

'డీజే టిల్లు'గా ఫిబ్రవరి 12న సిద్ధూ జొన్నలగడ్డ థియేటర్లలోకి రానున్నారు. ఇందులో నేహా శెట్టి హీరోయిన్. 

ఫిబ్రవరి 11న అమెజాన్ ఓటీటీలో దీపికా పదుకోన్, సిద్ధాంత్ చతుర్వేది, అనన్యా పాండే ప్రధాన పాత్రల్లో నటించిన 'గెహ్రాహియా'

సంక్రాంతికి థియేటర్లలో విడుదలైన 'హీరో' సినిమా ఫిబ్రవరి 11 నుంచి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది.