కన్నడ బ్యూటీ రష్మిక ఇప్పుడు బాలీవుడ్ బాట పట్టింది.

టాలీవుడ్‌లో ఇప్పటికే రష్మికాకు స్టార్ హీరోయిన్ ఇమేజ్ వచ్చేసింది.

‘పుష్ప: ది రైజ్’ సినిమాతో బాలీవుడ్ దృష్టిలో కూడా పడింది.

ప్రస్తుతం రష్మిక ‘గుడ్ బై’, ‘మిషన్ మజ్ను’, ‘యానిమల్’ సినిమాలు చేస్తోంది.

తెలుగులో ‘పుష్ప: ది రూల్’, తమిళ-తెలుగు చిత్రం ‘వారసుడు’లో నటిస్తోంది.

రష్మిక నటించిన ‘సీతా రామం’ త్వరలోనే విడుదల కానుంది.

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన కెరీర్ గురించి రష్మిక మాట్లాడింది.

‘నాకు రాత్రికి రాత్రే సక్సెస్ రాలేదు. ఏడేళ్ల కష్టపడితే వచ్చింది’ అని రష్మిక తెలిపింది.

ప్రస్తుతం కరోనాతో ఆగిపోయిన ప్రాజెక్టులు పూర్తిచేసే పనిలో ఉన్నానని పేర్కొంది.

మొత్తానికి రష్మిక ఇటు టాలీవుడ్, అటు బాలీవుడ్, కోలీవుడ్‌‌లను చుట్టేస్తూ బిజీగా గడిపేస్తోంది.

Images & Videos Credit: Rashmika Mandanna/Instagram