దీపిక పిల్లి.. అందంలోనే కాదు, డ్యాన్స్‌లో కూడా ఈమెకు తిరుగులేదు. దీపిక తన క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌తో కుర్రాళ్ల గుండెల్లో గూడు కట్టేసుకుంది. ‘ఢీ’ షోతో బుల్లితెరకు పరిచయమై ‘కామెడీ స్టార్స్’తో సెటిలైపోయింది. ఇప్పుడు ఏకంగా ‘వాటెండ్ పండుగాడు’లో హీరోయిన్ ఛాన్స్ కొట్టేసింది. కొద్ది రోజుల కిందట దీపిక చిన్న బ్రేక్ తీసుకుని హాలీడేస్ ఎంజాయ్ చేసింది. అప్పట్లో దీపిక తన స్నేహితులతో కలిసి కేరళలోని మున్నార్‌కు వెళ్లింది. తాజాగా ఆమె మరో ట్రిప్ వేసింది. మరో జలపాతం వద్ద ఎంజాయ్ చేస్తూ కనిపించింది. ప్రకృతి అందాలను చూస్తూ దీపిక మురిసిపోతోంది. జలపాతం వద్ద నిలుచుని నీటి జల్లులను ఆస్వాదించింది. వర్షాలను సైతం లెక్క చేయకుండా దీపిక షికార్లు చేస్తోంది. దీంతో జలుబు చేస్తుందేమో జాగ్రత్త దీపిక అని ఫ్యాన్స్ అంటున్నారు. Images and Videos Credit: Deepika Pilli/Instagram