ఒకప్పుడు హీరోయిన్ గా ఎన్నో సినిమాలు చేసిన జెనీలియా ఆ తరువాత పెళ్లి చేసుకొని సెటిల్ అయిపోయింది. పెళ్లి తరువాత ఫ్యామిలీ లైఫ్ కే ఎక్కువ సమయాన్ని కేటాయిస్తోంది. చాలా ఏళ్లుగా సినిమాలకు దూరంగా ఉంటోంది. అప్పుడప్పుడు కొన్ని టీవీ షోలలో కనిపిస్తూ అలరిస్తుంటుంది. ఇప్పుడు మళ్లీ రీఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతోంది. పాన్ ఇండియా లెవెల్ లో తెరకెక్కుతోన్న సినిమాలో హీరో సిస్టర్ గా కనిపించనుంది. అలానే మంచు విష్ణుతో ఓ సినిమా చేయనుందని టాక్. ఇదిలా ఉండగా.. తాజాగా ఈమె ఓ ఫొటోషూట్ లో పాల్గొంది. దానికి సంబంధించిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి.