అందాల శ్రీముఖి గురించి ఎంత చెప్పినా తక్కువే. ఒకప్పుడు ‘పటాస్’తో బోలెడంత వినోదాన్ని పంచింది రాములమ్మ. ఆ తర్వాత ‘బిగ్ బాస్’లో తన లక్ పరీక్షించుకుంది. కానీ, ‘బిగ్ బాస్’లో రన్నరప్ స్థానాన్ని సరిపెట్టుకోవల్సి వచ్చింది. ‘బిగ్ బాస్’ తర్వాత పూర్తిగా ఏ షోలోనూ అవకాశాలు చిక్కలేదు. ‘కామెడీ స్టార్స్’లో కొన్నాళ్లు మాత్రమే ఉంది. ప్రస్తుతం జీ తెలుగులో ‘స రె గ మ పా’లో యాంకరింగ్ చేస్తోంది. రాములమ్మ తాజాగా ఇన్‌స్టాలో ఫొటోలు పోస్ట్ చేసింది. శ్రీముఖి అందాల విందు చేయడంతో ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఈ ఔట్‌ఫిట్‌లో శ్రీముఖి చాలా హాట్‌గా ఉందని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. Images Credit: Sreemukhi/Instagram