'ఉప్పెన' సినిమాలో 'జలజల జలపాతం నువ్వు' సాంగ్ గుర్తు ఉందా? బోనీ కపూర్, శ్రీదేవి తనయ జాన్వీని చూస్తే ఆ పాట గుర్తొస్తుందా? జాన్వీ కపూర్ మోడ్రన్ గాళ్. శారీలో కూడా చాలా అందంగా ఉంటారు. అయితే, ఎక్కువ మోడ్రన్ డ్రస్‌లలో కనిపిస్తారు. జాన్వీ కపూర్ నటించిన లేటెస్ట్ సినిమా 'గుడ్ లక్ జెర్రీ'. నయనతార నటించిన తమిళ సినిమా 'కొలమావు కోకిల'కు 'గుడ్ లక్ జెర్రీ' హిందీ రీమేక్. ఇటీవల 'గుడ్ లక్ జెర్రీ' డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఓటీటీలో విడుదల అయ్యింది. 'గుడ్ లక్ జెర్రీ' విడుదల సందర్భంగా ప్రమోషనల్ కార్యక్రమాల్లో జాన్వీ కపూర్ ఇలా సందడి చేశారు. జాన్వీ కపూర్ లేటెస్ట్ ఫోటోలు జాన్వీ కపూర్ నడక చూశారా? చలాకీగా ఉంది కదూ! జాన్వీ కపూర్ 2022 ఫోటోలు ఫోటోలో కనిపిస్తున్నది జాన్వీ కపూర్ కారే. రేంజ్ రోవర్ కారులో ఆమె తిరుగుతున్నారు.