మంచు విష్ణు ఇప్పుడు ‘జిన్నా’ షూటింగులో బిజీగా ఉన్నారు. ‘జిన్నా’లో విష్ణు గాలి నాగేశ్వరరావు’ పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాలో సన్నీలియోన్ కూడా కీలక పాత్రలో నటిస్తోంది. షూటింగ్ స్పాట్‌లో విష్ణు, సన్నీ చేసే అల్లరి అంతా ఇంతా కాదు. సన్నీ, విష్ణుతో కలిసి ఒకరిని స్విమ్మింగ్‌పూల్‌లో పడేసింది. ఆ తర్వాత సన్నీ.. మంచు విష్ణును కూడా స్విమ్మింగ్ పూల్‌లోకి తోసేసింది. విష్ణును బయటకు లాగేందుకు చెయ్యి అందించిన సన్నీని మరొకరు నీటిలోకి తోసేశారు. సన్నీ లియోన్ ఈ వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌లో పోస్ట్ చేసింది. ఈ వీడియో చూసి సన్నీ చాలా ఫన్నీ అని నెటిజన్స్ అంటున్నారు. Image Credit: Sunny Leone/Instagram