ప్రణీత సుభాష్.. ఇటీవల పండంటి బిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. ప్రణీత హిందూ సాంప్రదాయాలను ఎంతో గౌరవిస్తుంది. అందరి హీరోయిన్ల తరహాలో ఆమె పెళ్లి ఆడంబరంగా జరగలేదు. ఆమె పెళ్లి సింపుల్‌గా జరగడానికి కరోనా కూడా ఒక కారణం. ‘భీమన అమావాస్య’ సందర్భంగా ప్రణీత తన భర్త కాళ్లకు పూజ చేసింది. ఫొటోలో ఆమె భర్తను పూర్తిగా చూపించకుండా కాళ్లు మాత్రమే కనిపించేలా పోస్ట్ చేసింది. ప్రణీత కేవలం నటి మాత్రమే కాదు, సామాజిక సేవకురాలు కూడా. ప్రణీత కొన్ని ప్రభుత్వ స్కూళ్లను దత్తత తీసుకోవడమే కాకుండా మోడ్రనైజ్ చేయించింది. సుమారు రూ.8 లక్షలతో కర్ణాటకలో 13 స్కూళ్లకు మరమ్మత్తులు చేయించింది ప్రణీత. అందుకే, కర్ణాటక ప్రజలకు ప్రణీత అంటే అంత గౌరవం. Images Credit: Pranitha Subhash/Instagram