రష్మిక మందన్నా క్యూట్ డ్యాన్స్, చూస్తే ఫిదా అయిపోతారు! రష్మిక మందన్నా ఇప్పుడు చాలా బిజీగా ఉంది. ప్రస్తుతం ఆమె తెలుగు, తమిళంతోపాటు హిందీ చిత్రాల్లోనూ నటిస్తోంది. బాలీవుడ్‌లో ఆమె నటించిన ‘గుడ్‌బై’ చిత్రం అక్టోబర్ 7న విడుదల కానుంది. ‘గుడ్‌బై’లో అమితాబ్ కూతురిగా రష్మిక నటించింది. ఆ సినిమాలోని ‘‘మండే, ట్యూస్డే’’ సాంగ్ బాగా ట్రెండవ్వుతోంది. రష్మిక తాజాగా ఆ పాటకు తన టీమ్‌తో కలిసి డ్యాన్స్ చేసింది. రష్మికతో కలిసి కొరియోగ్రాఫర్ గణేష్ ఆచార్య కూడా చిందులేశారు. గణేష్ ఆచార్య.. రష్మీక నటించిన ‘పుష్ప’లో ‘‘ఊ అంటావా’’ సాంగ్‌కు కొరియోగ్రాఫర్. ‘మండే, ట్యూస్డే’’ పాటకు కూడా ఆయనే కొరియోగ్రాఫర్. Images & Video Credit: Rashmika Mandanna/Instagram