నయన తార భర్త విఘ్నేష్ ఎమోషనల్, ఆ కల నేరవేరిందంటూ..

నయన తార, విఘ్నేష్ శివన్‌లు ఈ మధ్య విదేశాల్లోనే ఎక్కువ గడుపుతున్నారు.

పెళ్లి తర్వాత ఇండియాలో గడిపిన క్షణాలు చాలా తక్కువ.

ఈ జంట మొదటి హనీమూన్‌ను మాల్దీవుల్లో ఎంజాయ్ చేసిన సంగతి తెలిసిందే.

రెండో హనీమూన్ సందర్భంగా యూరప్ దేశాలను చుట్టేశారు.

తాజాగా విఘ్నేష్ శివన్ పుట్టిన రోజును దుబాయ్‌లో నిర్వహించారు.

నయన్‌తో కలిసి జరుపుకుంటున్న ఎనిమిదో పుట్టిన రోజని విఘ్నేష్ తెలిపాడు.

ఈ బర్త్ డే వేడుకల్లో విఘ్నేష్ తల్లి, కుటుంబ సభ్యులూ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా విఘ్నేష్ ఎమోషనల్ అయ్యాడు.

తన తల్లిని విదేశాల్లో తిప్పాలనేది తన కల అని, అది ఎట్టకేలకు నెరవేరిందన్నాడు.

మొత్తానికి విఘ్నేష్, నయన్‌లు హ్యాపీగా వైవాహిక జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నారు.

Images Credit: Vignesh Shivan/Instagram

Follow for more Web Stories: ABP LIVE Visual Stories