కోలీవుడ్ ముద్దుగుమ్మ అమలాపాల్ తెలుగులో కూడా పలు చిత్రాల్లో నటించింది. అల్లు అర్జున్, రామ్ చరణ్ లాంటి హీరోలతో కలిసి వెండితెరపై రొమాన్స్ చేసింది. ఆ తరువాత కాలంలో ఆమెకి తెలుగులో అవకాశాలు బాగా తగ్గాయి. పెళ్లి, డివోర్స్ తో వార్తల్లో నిలిచిన ఈ బ్యూటీ ఇప్పుడు తన కెరీర్ పై ఫోకస్ పెట్టింది. వెబ్ సిరీస్ లు, సినిమాలంటూ బిజీగా మారింది. 'ఆహా' యాప్ లో ఈమె నటించిన 'కుడి ఎడమైతే' అనే వెబ్ సిరీస్ విడుదలైంది. దీనికి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇదిలా ఉండగా.. ఈ బ్యూటీ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. తాజాగా ఆమె షేర్ చేసిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి. మాల్దీవ్స్ కి వెళ్లిన ఈ బ్యూటీ అక్కడి ఫొటోలను అభిమానులతో పంచుకుంటుంది.