అనసూయను గ్లామర్ డాల్ గా చూసే ప్రేక్షకుల సంఖ్య ఎక్కువే. బుల్లితెరపై ఆమె గ్లామర్ క్వీన్. ప్రేక్షకులు తనను గ్లామర్ డాల్‌గా చూస్తున్నా... ఎప్పుడూ అందంగా కనిపించాలని అనసూయ కోరుకోవడం లేదు. అప్పుడప్పుడూ నో మేకప్ ఫోటోలు, సెల్ఫీలు కూడా అనసూయ సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటారు. రియల్ లైఫ్ స్టోరీస్ షేర్ చేస్తుంటారు అనసూయ. లేటెస్టుగా అనసూయ షేర్ చేసిన ఫోటోలు ఇవి. వీటి స్పెషాలిటీ ఏంటంటే... ఆమె భర్త శశాంక్ భరద్వాజ్ ఈ ఫోటోలు తీశారు. ''నేను బయటకు వెళ్లే ముందు నా పనిలో ఉండగా (మేకప్ వేసుకుంటుండగా) మా ఆయన తీసిన ఫోటోలు ఇవి'' అని అనసూయ పేర్కొన్నారు. 'జబర్దస్త్'కు యాంకరింగ్ చేయడం మానేసిన అనసూయ... ప్రస్తుతం టీవీ షోస్ కంటే సినిమాలపై ఎక్కువ దృష్టి పెట్టారు. 'స్టార్ మా'లో సుధీర్, అనసూయ యాంకరింగ్ చేసిన 'సూపర్ సింగర్ జూనియర్' ప్రోగ్రాం కూడా అయిపోయింది. 'పుష్ప 2' షూటింగ్ స్టార్ట్ చేయడం కోసం అనసూయ వెయిట్ చేస్తున్నారు. అనసూయ నో మేకప్ ఫోటోలు (All Images courtesy - @itsme_anasuya/Instagram)