వాట్ ఏ రొమాంటిక్, శ్రియ వీడియో చూస్తే మీరూ అదే అంటారు 2001లో విడుదలైన ‘ఇష్టం’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది శ్రియా సరన్. తొలి సినిమాతోనే తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యింది శ్రియా. తక్కువ సమయంలోనే స్టార్ హీరోల సరసన ఛాన్స్ కొట్టేసి టాప్ హీరోయిన్‌గా ఎదిగింది. ప్రస్తుతం శ్రియా ఫ్యామిలీ లైఫ్‌ను ఎంజాయ్ చేస్తోంది. తన కూతురు, భర్తతో సరదాగా గడిపేస్తూ.. అప్పుడప్పుడు సినిమాల్లో మెరుస్తోంది. RRR సినిమాలో కనిపించింది కాసేపైనా చక్కని నటనతో ఆకట్టుకుంది. ప్రస్తుతం శ్రియ చేతిలో రెండు మూడు సినిమాలు ఉన్నాయి. శ్రియ మరోవైపు సోషల్ మీడియాలోనూ యాక్టీవ్‌గా ఉంటోంది. అప్పుడప్పుడు హాట్ హాట్ ఫొటోలు, వీడియోలు పోస్ట్ చేస్తోంది. తాజాగా ఆమె ఓ రొమాంటిక్ సాంగ్‌తో తన వీడియోను పోస్ట్ చేసింది. ఈ సాంగ్ చూసిన అభిమానులు ‘వాట్ ఏ రొమాంటిక్’ అని అంటున్నారు. శ్రియ వయస్సు పెరిగినా.. అందం మాత్రం తరగలేదని కామెంట్స్ చేస్తున్నారు. Images & Videos Credit: Shriya Saran/Instagram