RRR మల్లీ తల్లికి పెళ్లి, ఇవిగో ఫొటోలు ‘ఆర్ఆర్ఆర్’ మూవీలో మల్లీ పాత్రను ఎప్పటికీ మరిచిపోలేం. మల్లీ తల్లి.. లోకి పాత్రలో జీవించిన నటి పేరు అహ్మరీన్ అంజుమ్. ఆమె ఈ నెల 3న కోల్‌కతాలో డ్యానీ సురాను పెళ్లాడింది. తాజాగా అంజుమ్ తన పెళ్లి ఫొటోలను ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. అంజూమ్, డ్యానీలది ప్రేమ పెళ్లి. డ్యానీ బ్రిటీష్ ఇండియాన్. డ్యానీ, అంజూమ్‌లు థియేటర్ ఆర్టిస్టులుగా ఉన్నప్పుడే ప్రేమించుకున్నారు. అంజూమ్ ఇదివరకు కొన్ని నెట్‌ఫ్లిక్స్ వెబ్ సీరిస్‌ల్లో నటించింది. పాన్ ఇండియా తెలుగు చిత్రం ‘ఆర్ఆర్ఆర్’ ఆమెకు ఫస్ట్ మూవీ. ఇందులో అంజూమ్ గిరిజన మహిళ పాత్రలో నటించింది. Images & Videos Credit: Ahmareen Anjum/Instagram